పిల్లల్లో ఊబకాయం.! ఆ సమస్యలకు సంకేతం.!

- August 27, 2023 , by Maagulf
పిల్లల్లో ఊబకాయం.! ఆ సమస్యలకు సంకేతం.!

ఊబకాయం ఎవరికైనా సమస్యే. ఏ వయసు వారినైనా బాధించే ఈ సమస్య పిల్లల్లో మరింత ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

నిండుగా ముద్దుగా బొద్దుగా వుండే పిల్లలు మిక్కిలి ఆరోగ్యంతో వున్నట్లు భావిస్తుంటారు. కానీ, వుండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా వుంటే, అది ఊబకాయంగా పరిగణించాలి.

చిన్న వయసులోనే ఊబకాయం కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదముంది. అలాగే, గుండె జబ్బులు, కీళ్ల నొప్పి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడడడమే పిల్లల్లో ఊబకాయానికి కారణంగా చెబుతున్నారు.

ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎప్పుడూ మంచిది కాదు, తాజా కూరగాయలూ, పండ్లూ, మిల్లెట్స్ వంటి వాటికి పిల్లల్ని అలవాటు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే చక్కెర ఎక్కువగా వున్న ఆహారాన్ని పరిమితంగా వుంచాలి. ఆల్రెడీ ఊబకాయ సమస్య వున్న పిల్లలకు చక్కెర సంబంధిత ఆహార పదార్ధాల్ని వీలైనంత తక్కువ పెడితే మంచిది.

అలాగే ప్రతీరోజూ వ్యాయామం వంటి శారీరక శ్రమ కూడా అవసరం అని సంబంధిత ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com