చెన్నై షాపింగ్‌మాల్‌లో రోబో హల్చల్
- May 18, 2016
శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం '2.0'. బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని విజయ అనే పెద్ద షాపింగ్‌మాల్‌లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఉదయం 2 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ షూటింగ్లో చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్‌కుమార్, పలువురు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించని శంకర్ ఇలా మాల్లో ఎవరులేని సమయంలో షూటింగ్ జరపడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో అక్షయ్‌తో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆయన ఫొటోలు కొన్ని బయటకు వచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో శంకర్ ఇలా జాగ్రత్తపడి ఉండొచ్చు.
ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తున్నారు. 2010లో విడుదలైన రోబో చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ '2.0'ని తెరకెక్కిస్తున్నారు.ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









