ఈ రాత్రి చంద్రుడు నీలి రంగులోకి మారతాడా?

- August 31, 2023 , by Maagulf
ఈ రాత్రి చంద్రుడు నీలి రంగులోకి మారతాడా?

యూఏఈ: యూఏఈ అంతటా ఉన్న స్కైవాచర్‌లకు ఈ రాత్రి అరుదైన 'సూపర్ బ్లూ మూన్' కనువిందు చేయనుంది. అయితే చంద్రుడు నిజంగా నీలం రంగులోకి మారతాడా?అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. చంద్రుని రంగు అస్సలు మారదు. కానీ అది ఖచ్చితంగా అదనపు ప్రకాశవంతంగా మరియు పెద్దదిగా కనిపిస్తుంది. ఒకే (గ్రెగోరియన్) క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణమిలు ఉన్నప్పుడు 'బ్లూ మూన్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక సూపర్ మూన్, అదే సమయంలో చంద్రుడు పెరిజీలో అంటే భూమికి దగ్గరగా ఉంటుంది. ఈ రెండు ఖగోళ దృశ్యాలు ఈ రాత్రి జరగనున్నాయి. అందుకే దీనిని 'సూపర్ బ్లూ మూన్' అని పిలుస్తారు.సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో చంద్రుని పరిమాణంలో పెరుగుదల గమనించవచ్చని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం డైరెక్టర్ ఇంజినీర్ మహ్మద్ షౌకత్ అవద్ తెలిపారు. 2037లో అరుదైన సూపర్ బ్లూ మూన్ మళ్లీ కనిపించనుంది. కాబట్టి స్కైవాచర్‌లు ఈ రాత్రి ఖగోళ ట్రీట్‌ను మిస్ కావద్దు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com