'మనీ డిపాజిట్' ఆడియో రికార్డింగ్ పై అధికార యంత్రాంగం ప్రకటన
- September 03, 2023
యూఏఈ:సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న "మనీ డిపాజిట్" ఆడియో రికార్డింగ్‌పై అబుధాబిలోని న్యాయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆడియో రికార్డింగ్ తప్పుదోవ పట్టించేదిగా ఉందని, నిరాధారమైనదని, డిపాజిట్ లబ్ధిదారుడికి చెందినది కాదని అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్ (ADJD) స్పష్టం చేసింది. పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం మానుకోవాలని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది. తప్పుదారి పట్టించే ఆడియో రికార్డింగ్‌ను ప్రచురించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. యూఏఈలో పుకార్లు మరియు తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకోవడం అనేది 200,000 దిర్హామ్‌ల వరకు జరిమానా మరియు జైలు శిక్ష విధించబడే తీవ్రమైన నేరం అని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







