ఇండియన్ నేవీలో ఉద్యోగాలు....
- September 03, 2023
ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్, వైర్‌మ్యాన్, టైలర్. తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదోతరగతితోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 52 ట్రేడుల్లో ఎందులోనైనా ఏడాది లేదా రెండేళ్ల కోర్సు పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి -25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తుంది.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.18,000 బేసిక్ సాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు వేతనం అందుతుంది. ఎంపికైనవారు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్‌లో విధులు నిర్వర్తించాలి.
దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25 ఆఖరు తేదిగా నిర్ణయించారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు http://www.karmic.andaman.gov.in వెబ్సైట్ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







