ఇన్బౌండ్ సందర్శకుల సంఖ్య. 91.4 శాతం వార్షిక వృద్ధి
- September 03, 2023
దోహా: ఖతార్ లో మొత్తం ఇన్బౌండ్ సందర్శకుల సంఖ్య దాదాపు 288 వేలకు చేరుకుంది. నెలవారీ పెరుగుదల 2.1 శాతం (జూన్ 2023తో పోలిస్తే), వార్షిక పెరుగుదల 91.4 శాతం (జూలై 2022తో పోలిస్తే) నమోదైంది. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ (PSA) జారీ చేసిన "ఖతార్; మంత్లీ స్టాటిస్టిక్స్" బులెటిన్ తాజా ఎడిషన్ ప్రకారం.. GCC దేశాల నుండి అత్యధిక సంఖ్యలో సందర్శకులు 47 శాతం ఉన్నారు. పోర్ట్ రకం ద్వారా సందర్శకుల విషయానికొస్తే, మొత్తం సందర్శకుల సంఖ్యలో 58 శాతంతో ఎయిర్ ద్వారా సందర్శకులు అత్యధిక శాతంగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి టోటల్ బ్రాడ్ మనీ సప్లై (M2) జూలై 2023లో దాదాపు 684 బిలియన్ ఖతారీ రియాల్స్ నమోదు చేసింది. జూలై 2022తో పోలిస్తే వార్షిక పెరుగుదల 1.3 శాతంగా ఉంది. జూలై 2023లో 928 బిలియన్ ఖతారీ రియాల్స్కు చేరుకున్నాయి. జూలై 2022తో పోల్చితే ఈ సంఖ్య వార్షికంగా 3.8 శాతం తగ్గుదల నమోదు చేసింది. డిపాజిట్లు సుమారుగా 965 బిలియన్ ఖతారీ రియాల్స్ కు చేరుకున్నాయి. జూలై 2023లో నమోదైన మొత్తం కొత్త వాహనాల సంఖ్య 5657 కొత్త వాహనాలకు చేరుకుంది. ఈ సంఖ్య నెలవారీ తగ్గుదల 14.2 శాతంగా ఉంది. వార్షిక తగ్గుదల 2.9 శాతంగా నివేదికలో చూపించారు. జూలై 2023లో మొత్తం 595 ట్రాఫిక్ కేసులు నమోదయ్యాయి. నెలవారీ 3.9 శాతం తగ్గుదల.. వార్షిక తగ్గుదల 14.3 శాతంగా ఉంది. ఖతార్ మొత్తం జనాభా జూలై 2022 నాటికి 2.658 మిలియన్ల నుండి జూన్ 2023 నాటికి 2.704 మిలియన్లకు 1.72 శాతం వార్షిక మార్పుతో స్వల్పంగా పెరిగిందని, ఇది నెలవారీగా 1.8 శాతం తగ్గిందని(జూన్ 2023తో పోలిస్తే) జనాభా గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







