రాజమౌళి సినిమాలో సోనాల్ చౌహాన్.? క్రేజీ ఆఫర్‌లే.!

- September 04, 2023 , by Maagulf
రాజమౌళి సినిమాలో సోనాల్ చౌహాన్.? క్రేజీ ఆఫర్‌లే.!

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి హీరోయిన్ వేట కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి క్రేజీ స్టార్ హీరోయిన్‌ని ఈ సినిమా కోసం రాజమౌళి దించబోతున్నాడన్న ప్రచారం జరిగింది మొదట్లో.
అయితే, అనూహ్యంగా సోనాల్ చౌహాన్ పేరు వినిపించింది. అదేంటీ.! రాజమౌళి సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ ఏంటీ.? అని అవాక్కయ్యారంతా. ఆమె లిస్టులో చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు.
పెద్దగా క్రేజ్ కూడా లేదు సోనాల్‌కి అని ట్రోల్ చేశారు రాజమౌళిని. అయితే, రాజమౌళి లెక్కలు పక్కాగానే వుంటాయ్ కదా. ఏ పాత్రకు ఎవర్ని ఎందుకు ఎంచుకోవాలో.. జక్కన్న ఆయనకు తెలియకుండా వుంటుందా.? అని సరిపెట్టుకున్నారు.
అయితే, ఇప్పుడు సోనాల్ కాదట. మృణాల్ ఠాకూర్ అట.. అనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మృణాల్ ఠాకూర్‌కి ‘సీతారామం’ సినిమాతో బోలెడంత క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ అన్న ట్యాగ్ కూడా వుంది. అన్నింటికీ మించి ఎంతటి బరువైన పాత్రనైనా క్యారీ చేయగల కెపాసిటీ వున్న నటి.
సో, మృణాల్ ఠాకూర్ ఎంపిక సరైనదే అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com