‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా.!

- September 04, 2023 , by Maagulf
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా.!

నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ నెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మిస్టర్ పోలిశెట్టి అయిన నవీన్ పోలిశెట్టి ప్రమోషన్లు షురూ చేశాడు.
తనదైన శైలిలో ప్రమోషన్లకు దిగాడీ యంగ్ స్టర్. ‘జాతి రత్నాలు’ సినిమాతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. అనుష్కతో కలిసి నటించడమన్నదే క్రేజీ ఇష్యూ. అలాంటిది ఈ సినిమాతో ఆ ఛాన్స్ పట్టేశాడీ యంగ్ స్టర్.
షూటింగ్ టైమ్ అంతా చాలా చాలా ఎంజాయ్ చేశాననీ చెబుతున్నాడు. అనుష్క చాలా స్వీట్ అండ్ క్యూట్ అని చెప్పాడు. ఆమెతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు.
అయితే, ఇంత చెబుతున్నాడు కానీ, స్వీటీని ప్రమోషన్లకు మాత్రం తీసుకురాలేకపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. తెలుగు రాష్ర్టాలతో పాటూ, ఈ సినిమా యూఎస్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
సో, అక్కడ కూడా ప్రమోషన్లు జోరుగా చేయాలనుకుంటున్నాడట. తాజాగా బిగ్‌బాస్ గేమ్ షోలో సందడి చేశాడు నవీన్ పోలిశెట్టి. తద్వారా తన సినిమాని కూడా ప్రమోట్ చేసుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com