8 కొత్త గమ్యస్థానాలకు ఎమిరేట్స్ 'సింగిల్ టిక్కెట్' పథకం
- September 06, 2023
యూఏఈ: ఎమిరేట్స్ సింగిల్ టిక్కెట్ పథకం విస్తరణను ప్రకటించింది. ఎమిరేట్స్ కస్టమర్‌లు ఇప్పుడు దేశంలోని ఎనిమిది కొత్త గమ్యస్థానాలకు వెళ్లవచ్చు. మెక్సికో సిటీకి అదనంగా మెక్సికోలోని తొమ్మిది గమ్యస్థానాలను కొత్తగా ఈ పథకానికి చేర్చారు. ఎమిరేట్స్ విస్తృతమైన కోడ్‌షేర్ నెట్‌వర్క్ ప్రస్తుతం అమెరికా నగరాలకే పరిమితమైంది. అగ్రశ్రేణి విమానయాన సంస్థలు ప్రధాన వ్యాపార, సెలవు గమ్యస్థానాలలో క్యారియర్‌లతో ఒప్పందాల ద్వారా ప్రపంచ ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నాయి. కోడ్‌షేర్ భాగస్వామ్యం కస్టమర్‌లు సరళమైన కనెక్షన్‌లతో ఫ్లెక్సిబిలిటీని మరియు ఎంపికను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ఎమిరేట్స్‌లో ప్రయాణించే ప్రయాణీకులు అమెరికాలోని చికాగో లేదా హ్యూస్టన్‌లతోపాటు ఇప్పుడు మెక్సికోలోని కాంకున్, కోజుమెల్, మోంటెర్రే, ప్యూర్టో వల్లర్టా, గ్వాడలజారా, శాన్ జోస్ డెల్ కాబో, లియోన్/గ్వానాజువాటో మరియు క్వెరెటారో లకు వెళ్లవచ్చు. మెక్సికోలోని కోడ్‌షేర్ గమ్యస్థానాలకు టిక్కెట్‌లు సెప్టెంబరు 14 నుండి ప్రారంభమయ్యే ప్రయాణానికి emirates.com , ఇష్టపడే ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటాయని ఎమిరేట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







