షార్జాలో జరిమానాలపై 50% తగ్గింపు..!
- September 06, 2023
యూఏఈ:క్రౌన్ ప్రిన్స్ అధ్యక్షతన జరిగిన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మంగళవారం నాడు మునిసిపల్ ఉల్లంఘనల జరిమానాల మొత్తం విలువపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 90 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది. షార్జా ఎమిరేట్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన గృహయజమానులకు సహాయం మంజూరు చేయడంపై కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం, ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి సహాయం అందించడానికి సామాజిక సేవల విభాగాని బాధ్యత అప్పగించారు. షార్జా క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ పాలకుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. షార్జా ఎమిరేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం మంగళవారం హిస్ హైనెస్ ది రూలర్ కార్యాలయంలో జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







