టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు..
- September 06, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానమైంది.. గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25ఏళ్లలోపు యువత కోటి గోవింద నామాలు పూర్తిచేస్తే.. వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. యువతీ లేదా యువకుడు 10,01,116 సార్లు గోవింద నామాలు రాస్తే ఆ వ్యక్తికి స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







