దుబాయ్ లో ట్రాఫిక్ సులభతరానికి మూడు కీలక రోడ్ ప్రాజెక్ట్‌లు
- September 06, 2023
యూఏఈ: దుబాయ్ గత కొన్ని నెలలుగా కొన్ని ప్రధాన రహదారి ప్రాజెక్టులను అమలు చేసింది. వీటిలో దుబాయ్-అల్ ఐన్ రోడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్, అల్ షిందాఘా కారిడార్ అభివృద్ధి కింద ఇన్ఫినిటీ బ్రిడ్జ్ డెవలప్, షేక్ రషీద్ బిన్ సయీద్ కారిడార్ డెవలప్ మెంట్ ఉన్నాయి. తదుపరి దశలో అనేక ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడానికి యోచిస్తోన్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఉన్నతాధికారులు మంగళవారం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు తెలిపారు.
హెస్సా స్ట్రీట్: షేక్ జాయెద్ రోడ్‌తో కూడలి నుండి అల్ ఖైల్ రోడ్ వరకు 4.5 కి.మీ విస్తరించి, దాని సామర్థ్యాన్ని గంటకు 16,000 వాహనాలకు పెంచడానికి అభివృద్ధి చేయబడుతుంది.
ఉమ్ సుఖీమ్ స్ట్రీట్: అల్ ఖైల్ రోడ్‌తో కూడలి నుండి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వరకు 4.6 కి.మీ విస్తరించి, దాని సామర్థ్యాన్ని గంటకు 16,000 వాహనాలకు పెంచడానికి అభివృద్ధి చేయబడుతుంది.
అల్ ఖలీజ్ స్ట్రీట్: ఇన్ఫినిటీ బ్రిడ్జ్ ర్యాంప్ నుండి కైరో స్ట్రీట్ వరకు 3 కిమీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ గంటకు 12,000 వాహనాల సామర్థ్యంతో 1.65 కిమీ విస్తరించి ఉన్న మూడు అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని చేపడతారు.
దుబాయ్ రహదారి నెట్వర్క్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. దుబాయ్ రోడ్ నెట్వర్క్ మొత్తం పొడవు 2006లో 8,715 లేన్-కిమీ ఉండగా.. అది 2022లో 18,768కి పెరిగింది. ఇది 115 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఎమిరేట్ రోడ్ నెట్వర్క్, భద్రతా ప్రమాణాలు స్వీడన్, నార్వే మరియు జపాన్‌లోని పట్టణ కేంద్రాలతో పాటు ట్రాఫిక్ భద్రత పరంగా ఉత్తమ ప్రపంచ నగరాల్లో ఒటకిగా దుబాయ్‌ని నిలిపింది. లాస్ ఏంజిల్స్, మాంట్రియల్, సిడ్నీ, బెర్లిన్, రోమ్ మరియు మిలన్ వంటి ప్రధాన ప్రపంచ నగరాలను దుబాయ్ తన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD)లో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి అవసరమైన సగటు సమయం పరంగా అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రద్దీని, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న టామ్‌టామ్ 2022 ట్రాఫిక్ సూచిక నివేదిక ప్రకారం.. దుబాయ్‌లోని CBDలో ప్రయాణ సమయం 10కి.మీకి సగటున 21 నిమిషాలతో పోలిస్తే 10కి.మీకి 12 నిమిషాలుగా నమోదు చేసింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









