ఇరాన్-సౌదీ సంబంధాల్లో కీలక ముందడుగు..!
- September 06, 2023
టెహ్రాన్: ఇరాన్ మరియు సౌదీ అరేబియా ఈ ప్రాంతంతోపాటు ఇస్లామిక్ ప్రపంచంలో రెండు ప్రభావవంతమైన దేశాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. మెరుగైన ఇరాన్-సౌదీ సంబంధాలు ఈ ప్రాంతంలో విదేశీ జోక్యాల పరిధిని తగ్గించగలవని రైసీ చెప్పారు. సౌదీ అరేబియాకు నియమించబడిన ఇరాన్ రాయబారి అలీరెజా ఎనయాటి రియాద్‌కు బయలుదేరే ముందు ఇరాన్ అధ్యక్షుడిని కలిసారు. టెహ్రాన్, రియాద్ మధ్య సంబంధాలను మరింత ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రైసీ పిలుపునిచ్చారు. 2023 మార్చి 10న బీజింగ్‌లో చైనా మధ్యవర్తిత్వం వహించిన చారిత్రాత్మక ఒప్పందంలో సౌదీ అరేబియా, ఇరాన్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునఃప్రారంభించాలని.. ఏడేళ్ల విరామం తర్వాత తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు ఇరాన్లో సౌదీ అరేబియా కొత్త రాయబారి అబ్దుల్లా అల్-ఎనెజీ మంగళవారం తన బాధ్యతలను స్వీకరించేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆయనకు ఇరాన్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







