నిద్రలేమికి కొత్త చికిత్స
- June 25, 2015
చాలామందికి ఈ సమస్య చాలా బాధిస్తుంది. రాత్రంతా నిద్ర పట్టక, మెళకువగానే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. దాంతో రోజంతా అలసట, బద్దకం, రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ నిద్రలేమితో అలసటలాంటి సమస్యలే కాదు. మతిమరుపు, ఏకాగ్రత తగ్గటం, మధుమేహం, నీరసం, నరాల బలహీనతలాంటి పెద్ద సమస్యల ముప్పు కూడా పొంచి ఉంది. అయితే ఇది దీర్ఘకాల సమస్యగా ఉంటే, వైద్యుల వద్దకు వెళితే తాత్కాలికంగా ఉపశమనాన్నిచ్చే నిద్ర మాత్రల వంటివి సిఫారసు చేస్తారు. అయితే వీటితో ఈ సమస్య తాత్కాలికంగా తగ్గినట్లనిపించినా, వీటికి అలవాటు పడడం వల్ల శరీరానికి ఇతర దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఈ నిద్రలేమిని ఎదుర్కోవడానికి కొందరు అమెరికన్ వైద్య నిపుణులు ఒక కొత్త రకమైన చికిత్సను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ చికిత్స పేరే ‘కాగ్నెటివ్ బిహేవియర్ థెరఫీ’. దీంతో మంచి ఫలితం కనబడుతోందని పరిశోధకులు చెప్తున్నారు. అసలు ఈ థెరఫీ ఏంటి అంటే అనుభవజ్ఞులైన ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఈ సమస్యతో బాధపడేవారికి ప్రత్యేకంగా కొంత కౌన్సిలింగ్ ఇస్తారట. దాంతో మన ఆలోచనా సరళిలోనూ, ప్రవర్తనలోనూ కొన్ని రకాల మార్పులు చోటు చేసుకునేలా చేయడం జరుగుతుందట. దాంతో ఆయ పరిస్థితులకు అనుగుణంగా మన మెదడు స్పందించేలా నిపుణులు కౌన్సిలింగ్ నేర్పిస్తారట. దాంతో ప్రతిరోజూ నిద్రపోయే కన్నా 20 నిముషాలు ముందుగానే నిద్రకి ఉపక్రమించడమే కాకుండా ఇంకొక 20 నిముషాలు ఎక్కువగా కూడా నిద్రపట్టే అవకాశం ఉంటుందట. ఈ చికిత్స ద్వారా నిద్రలేవగానే ఎంతో హాయిగా ఉండి, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, చెడు ఆలోచనలు, ఆందోళనలు తగ్గి, మనసుకు మంచి విశ్రాంతి కూడా లభిస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణులు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









