సోమాలియాలో యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా జరిగిన దాడిలో 6గురి మృతి
- June 25, 2015
సోమాలియా రాజధాని మొగదిషూలో ఈ బుధవారం యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా అల్ షాబాబ్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతిదళ సభ్యుడు తన కారుతో, సహాయకదళ పికప్ ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. కాగా, సోమాలియా పోలీసు అధికారి అబ్డుకాదీర్ హస్సన్, యు.ఎ. ఇ. అధికారులెవరు ఈ దాడిలో గాయపడలేదని స్పష్టం చేశారు.
సోమాలియాలో యు.ఎ.ఇ. దళాలు రక్షణ, మౌలికవసతి, అభివృద్ధి ప్రోజక్టులు ఇంకా అనేక సహాయక చర్యలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ ఘటనపై యు.ఎ. ఇ. విదేశీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. అన్వర్ మొహమ్మద్ గార్గాష్ ఈ తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







