యూఏఈలో భారీ వర్షాలు.. కొత్త క్లౌడ్-సీడింగ్ ప్రభావమేనా?

- September 07, 2023 , by Maagulf
యూఏఈలో భారీ వర్షాలు.. కొత్త క్లౌడ్-సీడింగ్ ప్రభావమేనా?

యూఏఈ: గత రెండు రోజులుగా యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొత్త క్లౌడ్-సీడింగ్ క్యాంపెయిన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు భావిస్తున్నారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) గత రెండు రోజులుగా అల్ అయిన్, రస్ అల్ ఖైమా మరియు షార్జాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు నివేదించింది. అల్ ఐన్‌లో అధిక వేగంతో వీస్తున్న గాలుల వీడియోను అధికార యంత్రాంగం ట్విటర్ లో షేర్ చేసింది. ఈ వర్షాలు NCM ప్రారంభించిన కొత్త క్లౌడ్-సీడింగ్ పరిశోధన ఫలితంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. 'క్లౌడ్-ఏరోసోల్-ఎలక్ట్రికల్ ఇంటరాక్షన్స్ ఫర్ రెయిన్‌ఫాల్ ఎన్‌హాన్స్‌మెంట్ ఎక్స్‌పెరిమెంట్ (క్లౌడిక్స్)' పేరుతో, క్లౌడ్ ఫిజిక్స్ రీసెర్చ్‌లో ప్రత్యేకత కలిగిన యూఎస్-ఆధారిత కంపెనీ స్ట్రాటన్ పార్క్ ఇంజనీరింగ్ కంపెనీ (SPEC) సహకారంతో అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పరిశోధన డ్రైవ్ నిర్వహిస్తున్నారు.  ఈ ప్రక్రియ నేరుగా క్లౌడ్-సీడింగ్ ఎఫెక్ట్‌లను విస్తరించడానికి, వర్షపాతం పెరగడానికి దోహదం చేస్తుందని NCM ఈ నెల ప్రారంభంలో తెలిపింది. యూఏఈ దాదాపు రెండు దశాబ్దాలుగా వర్షాలను పెంచడానికి క్లౌడ్ సీడింగ్‌ని విజయవంతంగా ఉపయోగిస్తోంది. NCM నిర్వహించే రెయిన్ ఎన్‌హాన్స్‌మెంట్ సైన్స్ కోసం యూఏఈ పరిశోధన కార్యక్రమం ప్రపంచ నీటి భద్రతను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం యూఏఈలో వర్షపాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. జూన్‌లో ఒక NCM అధ్యయనం అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (UAS) క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలను మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపితమైందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com