ఖతార్ జలాల్లో 50కి పైగా షార్క్ ల సంచారం

- September 07, 2023 , by Maagulf
ఖతార్ జలాల్లో 50కి పైగా షార్క్ ల సంచారం

దోహా: ఇటీవల ఖతార్ జలాల్లో వివిధ జాతులకు చెందిన 50కి పైగా షార్క్ లు కనిపించాయి. అధికారుల ప్రకారం.. ఇది అతిపెద్ద షార్క్ సముహంగా చెబుతున్నారు. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం, ఈ సమావేశంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మూడు జాతులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఖతార్‌లోని ఉత్తర సముద్ర ప్రాంతాలకు క్షేత్ర పర్యటన సందర్భంగా పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలోని రక్షణ మరియు సహజ నిల్వల విభాగానికి చెందిన పరిశోధనా బృందం వీటిని గుర్తించింది. షార్క్ వీడియోను మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. "దేశంలో ఈ వైవిధ్యమైన షార్క్ ల  జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి.. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులను రక్షించడానికి మంత్రిత్వ శాఖ చేసిన గొప్ప ప్రయత్నాలు ఫలితం ఇచ్చింది. " అని మంత్రిత్వ శాఖ తన పోస్టులో పేర్కొంది. కనిపించిన షార్క్ సముహంలో "కామన్ బ్లాక్‌టిప్ షార్క్స్ (కార్చర్‌హినస్ లింబటస్), గ్రేస్‌ఫుల్ షార్క్స్ (కార్చర్‌హినస్ ఆంబ్లిరిన్‌కోయిడ్స్), స్పిన్నర్ షార్క్స్ (కార్చార్‌హినస్ బ్రేవిపిన్నా) వంటి అరుదైన షార్క్ జాతులు ఉన్నాయని పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రాంతీయ వేల్ షార్క్ కన్జర్వేషన్ సెంటర్ (RWSCC)  వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com