ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం ..

- May 19, 2016 , by Maagulf
ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం ..

అమెరికా ఫెడ్ రిజర్వు జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతోందనే సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. 30వేల స్థాయి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఇటీవల విఫలమైన బంగారం ధర మరింత పతనమై 30వేల రూపాయల కిందికి దిగజారింది. ఫెడ్ ప్రకనటతో గురువారం బులియన్ మార్కెట్ లో పసిడి ధరల జోరుకు భారీ బ్రేక పడింది. సుమారు మూడువారాల దిగువకు పడిపోయాయి. 314 రూపాయల నష్టంతో పది గ్రాముల పసిడి ధర 29,741రూపాయలుగా నమోదైంది. వెండిధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇటీవల స్తాయిలో నిలదొక్కుకోవడంలో విఫలమైన పసిడి ఇపుడు మరింత వెలవెలబోతోంది. అటు ఫెడ్ రిజర్వు వడ్డన తప్పదనే వార్తలతో డాలర్ దూసుకుపోతుండగా, ఆసియన్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇక ఇతర విలువైన లోహాల సంగతి కొస్తే వెండి, పల్లాడియం స్వల్పంగా పెరగ్గా, ప్లాటినం ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అయితే పసిడి ధరల తగ్గుదలు పెట్టుబడిదారులు కొనుగోళ్లకు వినియోగించుకుంటారని గోల్డ్ ఫండ్ మేనేజర్ రిచర్డ్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం చూపబోదని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com