'రోను' తుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం..
- May 19, 2016
బంగాళాఖాతంలో ఏర్పడిన 'రోను' తుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది కోస్తా తీర ప్రాంతానికి అంతకంతకూ చేరువవుతోంది. రోను తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్లు, విశాఖపట్నానికి నైరుతి దిశలో 290 కిలోమీటర్లు, కాకినాడకు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఒడిశా వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. 'రోను' శుక్రవారానికి ఆంధ్రా-ఒడిశా తీరంలో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశా, పాండిచ్చేరి రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.కోస్తా అతలాకుతలం 'రోను' తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.ప్రభుత్వం అప్రమత్తం తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయచర్యలు ముమ్మరం చేయాల్సిందిగా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. తుపాను మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. కోస్తా తీరం వెంబడి అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల సెల్‌ఫోన్ సిగ్నళ్లు లేకపోవడంతో తుపాను సమాచారం తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీరం వెంబడి 50 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







