160 దేశాలకు 95 బిలియన్ డాలర్ల మానవతా సహాయం: సౌదీ
- September 08, 2023
కైరో: మానవతా ప్రయోజనాల కోసం తన సామర్థ్యాలన్నింటినీ వినియోగించుకోవడానికి సౌదీ అరేబియా ఎన్నడూ వెనుకాడలేదని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఇంజినీర్ వలీద్ అల్-ఖెరీజీ స్పష్టం చేశారు. గత 70 సంవత్సరాలలో $95 బిలియన్లకుపైగా మానవతా సహాయం కింద ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు అందించినట్లు పేర్కొన్నారు. కైరోలోని లీగ్ ప్రధాన కార్యాలయంలో మంత్రుల స్థాయిలో అరబ్ లీగ్ కౌన్సిల్ 160వ సాధారణ సమావేశానికి విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తరపున హాజరైన సందర్భంగా అల్-ఖెరీజీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు సౌదీ కృషి కొనసాగుతుందని తెలిపారు. అరబ్-జపానీస్ రాజకీయ సంభాషణ కోసం మంత్రివర్గ సమావేశం మూడవ సెషన్‌కు విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తరపున అల్-ఖెరీజీ సౌదీ ప్రతినిధి బృందానికి కూడా నాయకత్వం వహించారు. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయంలో అరబ్, జపాన్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అరబ్ పక్షానికి ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ నేతృత్వం వహించగా, జపాన్ వైపు దాని విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి నేతృత్వం వహించారు.
అరబ్-జపనీస్ సహకారాన్ని వివిధ రంగాల్లో మెరుగైన స్థాయికి తీసుకురావాలనే సౌదీ ఆకాంక్షను అల్-ఖెరీజీ తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యాన్ని సురక్షితమైన, స్థిరమైన మరియు సంపన్న ప్రాంతంగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు, ఇది అందరికీ మంచి భవిష్యత్తు కోసం ఆశను ఇస్తుందన్నారు. "శాంతిని స్థాపించడం, చర్చల పరిష్కారాలను ప్రోత్సహించడం, భద్రత, స్థిరత్వం మరియు అభివృద్ధిని బలోపేతం చేయడం వంటి వాటి ప్రాముఖ్యతకు సంబంధించి జపాన్‌తో విస్తృత ఒప్పందం ఉంది" అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స