యూఏఈలో రక్తదానం చేసిన మమ్ముట్టి ఫ్యాన్స్
- September 08, 2023
యూఏఈ: మలయాళ నటుడు మమ్ముట్టి అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో యూఏఈలో 300 మందికి పైగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 మమ్ముట్టి 72వ పుట్టినరోజు సందర్భంగా 18 దేశాలలో 25,000 మంది రక్తదానం చేయడానికి ప్రపంచవ్యాప్త పిలుపులో భాగంగా యూఏఈలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. యూఏఈలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన సఫీద్ మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా హీరో పుట్టినరోజును ఎంతో మందికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనుకుంటున్నాం. మేము గత వారం ఆస్ట్రేలియాలో రక్తదాన ప్రచారంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాము."అని తెలిపారు. యూఏఈలో మూడు వారాల పాటు మూడు ఎమిరేట్స్‌లో క్యాంపులు జరిగాయన్నారు. క్యూసైస్‌లోని లులు హైపర్‌మార్కెట్‌లో గురువారం చివరి శిబిరం జరిగిందని, అందులో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలివచ్చారని తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఉన్న మమ్ముట్టి ఐదు దశాబ్దాల నుండి సినీమా రంగంలో ఉన్నారు. వివిధ భాషలలో 400 చిత్రాలలో నటించాడు. భారతదేశంలో అనేక అత్యున్నత పురస్కారాలను గెలుచుకున్న అతను దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను, అతను 1998లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







