జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది: టీడీపీ ఏపీ అధ్యక్షుడు
- September 10, 2023
అమరావతి: జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. దేశంలో ఏ ఒక్కరిని అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారు. కావాలనే చంద్రబాబును స్కిల్ డవలప్మెంట్ కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్ పని. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆనందపడుతున్న వ్యక్తి జగన్ అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు.
చంద్రబాబు ఉగ్రవాది కాదు, పారిపోయే వ్యక్తి కాదు, చంద్రబాబు ఎక్కడో దాక్కునే వ్యక్తి కాదని అన్నారు. ఐదేళ్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో ఉద్యోగాలు పొందారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారని అన్నారు. చంద్రబాబును కావాలని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలని అచ్చెన్నాయుడు కోరాడు. చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు కేవలం రాజకీయ కక్షతోనే ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







