మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఎమిరేట్స్ విమానం దారి మళ్లింపు
- September 10, 2023
దుబాయ్: దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు.
ఢిల్లీలో విమానాన్ని ల్యాండింగ్ చేశాక అనారోగ్యం పాలైన విమాన ప్రయాణికుడిని దించి ఆసుపత్రికి తరలించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గ్వాంగ్జౌ వెళ్లే ఎమిరేట్స్ విమానాన్ని శుక్రవారం ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది.
వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుడిని స్థానిక వైద్య సిబ్బంది పరీక్షించి, అవసరమైన చికిత్సను అందించారు. అనంతరం ఢిల్లీ నుంచి ఎమిరేట్స్ విమానం బయలుదేరి గ్వాంగ్జౌకు ప్రయాణాన్ని కొనసాగించిందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







