ఖతార్ లో భారత రాయబారిని సన్మానించిన తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్

- September 13, 2023 , by Maagulf
ఖతార్ లో భారత రాయబారిని సన్మానించిన తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్

దోహా: సెప్టెంబరు 11న ఖతార్‌లో భారత రాయబారిగా కొత్తగా నియమితులైన విపుల్ కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ (TWAQ) ఆయనను వారి ప్రధాన కార్యాలయంలో ఘనంగా సన్మానించింది.  భారతదేశం-ఖతార్ సంబంధాన్ని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా భారత రాయబారి స్పష్టం చేశారు. TWAQ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఖతార్‌లోని తమ కమ్యూనిటీ శ్రేయస్సును మరింత మెరుగుపరచడానికి భారత రాయబార కార్యాలయంతో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్..  ఖతార్‌లోని తెలంగాణ ప్రవాసులలో సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అసోసియేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, భారతీయ మరియు ఖతార్ సమాజాలకు సానుకూలంగా దోహదపడే ధార్మిక ప్రయత్నాలతో సహా వివిధ కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. ఈ  సమావేశంలో TWA Q చైర్మన్ ఖాజా నిజాముద్దీన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు రమేష్ పిట్ల (వైస్ ప్రెసిడెంట్), నవీద్ దస్తగిర్ (ప్రధాన కార్యదర్శి), రాధికసాయికృష్ణ యేముల (మహిళా విభాగం అధ్యక్షురాలు), పద్మావతి (మేనేజింగ్ కమిటీ సభ్యురాలు), మొయినుద్దీన్ బఖర్ సయ్యద్ (క్రీడలు, యువజన కార్యకలాపాల కార్యదర్శి), మహ్మద్ ఖాజా (మీడియా & డెవలప్‌మెంట్ సెక్రటరీ), ఖాజా నిజాముద్దీన్ (సలహా మండలి చైర్మన్), గులాం రసూల్ (సలహా మండలి సభ్యుడు), మహ్మద్ షూబ్ (సలహా మండలి సభ్యుడు) పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com