భిక్షాటన ముఠాగుట్టును బట్టబయలు చేసిన ఖతార్ అధికారులు
- September 15, 2023
దోహా: మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ దాడులు ఉధృతం చేసింది. భిక్షాటన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అరెస్టు చేసింది. సదరు ముఠాలో ఉన్నవారు ఆసియా దేశానికి చెందిన వారని అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో భిక్షాటన చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేయడం కనిపించింది. వారి నుంచి నగదు, పాస్‌పోర్టులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. "మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా స్వప్రయోజనాల కోసం యాచించడం కోసం ప్రజలను దోపిడీ చేయడంలో పాల్గొన్న ఒక ఆసియా దేశానికి చెందిన వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పట్టుబడిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!







