పురందేశ్వరి చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరరావు సెంటినరీ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరణ
- September 15, 2023
విజయవాడ: దివంగత నటులు అక్కినేని నాగేశ్వర రావు శతజయంతిని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినీ రంగంతో పాటు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఏ.ఎన్.ఆర్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ పేరిట ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియం లో సత్కరించనున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శతజయంతి వేడుక పోస్టర్ ని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి విజయవాడలో ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేయనున్న పురందేశ్వరి మాట్లాడుతూ తనకు బాబాయి వంటి మహానటులు అక్కినేని గారి శతజయంతి వేడుకకు ఆహ్వానించడం చాలా ఆనందంగా వుంది.దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అందించే ఈ సత్కారం మేధావి అయిన బాబాయికి నిజమైన నివాళి అని అన్నారు. ఎఫ్.టి.పీ.సీ ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సుపరిచుతులైన ఏ.ఎన్.ఆర్ వేడుకను పాన్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తున్నామని , ఈ వేడుక నిర్వహించడాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకొని బహు రాష్ట్రాల సినీ సామాజిక రంగలవారిని సత్కరించనున్నామని అన్నారు. తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు వీస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ మూల స్తంబాలలో ఒకరైన అక్కినేని శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ మరియు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పాతూరు నాగభూషణం, డాక్టర్ రాంచంద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







