ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ విజయవంతం

- September 16, 2023 , by Maagulf
ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ విజయవంతం

బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ డైరెక్టరేట్, బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ (BAC) సహకారంతో ఇటీవల విమానాశ్రయ ప్రాంగణంలో వర్చువల్ ఎక్సర్ సైజ్ నిర్వహించింది. ఈ కసరత్తులో స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవిడెన్స్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు యాంటిక్విటీస్ వింగ్‌తో సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఇంటీరియర్ మినిస్టర్ ఆదేశాలకు అనుగుణంగా మరియు ప్రెసిడెన్సీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ పర్యవేక్షణలో వర్చువల్ ఎక్సర్ సైజ్ లు జరిగాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోర్ట్స్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ అహ్మద్ జాసిమ్ అల్ హతిమి తెలిపారు.  ఏదైనా అత్యవసర పరిస్థితికి వేగంగా ప్రతిస్పందించడంలో సంబంధిత అధికారుల సంసిద్ధత, సామర్థ్యాన్ని అంచనా వేయడం దీని లక్ష్యమన్నారు. దీంతోపాటు ఏదైనా అత్యవసర సంఘటనను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సంస్థల మధ్య సహకారం, సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com