సమంతకు ఆ బాలీవుడ్ ప్రాజెక్ట్ నిజమేనా.?

- September 16, 2023 , by Maagulf
సమంతకు ఆ బాలీవుడ్ ప్రాజెక్ట్ నిజమేనా.?

ఇటీవల ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత త్వరలో ఓ బాలీవుడ్ ప్రాజెక్టులో కనిపించబోతున్నాట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కోసం సమంత పేరు పరిశీలిస్తున్నారట.
అయితే, సమంత ప్రస్తుతం తన అనారోగ్య పరిస్థితుల కారణంగా కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటోంది. తెలుగులో కొత్తగా ప్రాజెక్టులేమీ సైన్ చేయలేదు.
మరి, తాజాగా జరుగుతోన్న ప్రచారం ప్రకారం, బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తుందా.? చూడాలి మరి.
అన్నట్లు సమంతకు ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం లేటెస్ట్ మూవీ ‘జవాన్’ అంటున్నారు. ఈ సినిమాలో సౌత్ హీరోయిన్ నయన తార హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి.. వసూళ్లు కొల్లగొడుతోంది. బాలీవుడ్‌కి ఈ సినిమా పెద్ద ఊరట అని చెప్పొచ్చు. 
ఈ సక్సెస్ రీజన్‌తోనే సల్మాన్ ఖాన్ కూడా సమంత వంటి ఇమేజ్ వున్న సౌత్ హీరోయిన్‌ని తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నాడట. చూడాలి మరి, సమంత ఏం చేస్తుందో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com