ఇండియా-శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్: దుబాయ్‌లో ఎక్కడ చూడొచ్చంటే..?

- September 17, 2023 , by Maagulf
ఇండియా-శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్: దుబాయ్‌లో ఎక్కడ చూడొచ్చంటే..?

యూఏఈ: ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఉత్కంఠభరితమైన ఫైనల్‌ను చూసేందుకు యూఏఈ వాసులు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 17న ఇండియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. యూఏఈ సమయం ప్రకారం.. మద్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఎక్కడ చూడొచ్చు

దుబాయ్ లో ఆసియా కప్ ను చూసేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. వివరాల్లోకి వెళితే.. 

1. హడిల్

దుబాయ్‌లోని ప్రముఖ స్పోర్ట్స్ బార్. గేమ్ చూస్తూ రుచికరమైన ఏదైనా తినాలనుకునే వారి కోసం వారు ఆహారం మరియు పానీయాలతో కూడిన ఫిక్స్‌డ్ మెనూని అందిస్తారు. మీరు 050 100 7065కు కాల్ చేయడం ద్వారా ముందుగానే సీటును రిజర్వ్ చేసుకోవచ్చు.

2. ఫ్లయింగ్ క్యాచ్

ఏస్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పోర్ట్స్ రెస్టారెంట్‌లో ఆరు LED స్క్రీన్‌లు,  భారీ 200cm జెయింట్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జుమేరా 1లో ఉన్న ఫ్లయింగ్ క్యాచ్ బఫే-శైలి ఎంపికలను ఒక్కొక్కరికి Dh149, వారి మెనూలో ఐటమ్స్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించారు.

3. TJ లు

ఆసియా కప్ కోసం క్రికెట్ ఔత్సాహికులు తాజ్ జుమేరా లేక్స్ టవర్స్‌లోని TJలకు వెళ్లవచ్చు. కొన్ని గొప్ప మ్యాచ్-అవర్ డీల్‌లను అందిస్తుంది. అన్ని పానీయాలపై 50 శాతం తగ్గింపుతోపాటు మెయిన్ కోర్సు Dh99 నుంచి ప్రారంభం అవుతున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com