మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని కోరుకుంటున్నా: మంత్రి కెటిఆర్
- September 20, 2023
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా నేతలు చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లో భాగంగా నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను’’ అని కెటిఆర్ అన్నారు.
ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లైఫ్‌సైన్సెస్ హబ్‌గా మారుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చాలా అందమైన నగరమని.. ఇక్కడ టాలెంట్‌కు కొరత లేదని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని తెలిపారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
- విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం: సీఎం చంద్రబాబు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!







