సప్తగిరుల్లో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- September 20, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనిమిచ్చారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. యోగ నరసింహ స్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి తిరు వీధుల్లో విహరించారు. అధికసంఖ్యలో తరలి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరగనుంది.

అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరగనుంది.
తాజా వార్తలు
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
- విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం: సీఎం చంద్రబాబు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!







