పర్యావరణ కాలుష్యానికి పాల్పడే వారికి భారీ జరిమానా
- September 21, 2023
రియాద్ : పర్యావరణాన్ని కలుషితం చేయడం, పర్యావరణ ప్రదేశాలను దెబ్బతీసే వారిపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని సౌదీ పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దెబ్బతిన్న పర్యావరణ ప్రదేశాల పునరావాసం, కలుషితమైన సైట్ల బాగు కోసం కార్యనిర్వాహక నిబంధనలకు ఉల్లంఘనలు, జరిమానాలను జోడించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. భూమి మరియు ఇతర పర్యావరణ సైట్లను ట్యాంపరింగ్ చేయడం, దెబ్బతీసే వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేస్తారు. ఉల్లంఘనను సరిదిద్దడం, పాడైన సైట్లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రతను బట్టి SR10000 నుండి SR100000 వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!









