సెప్టెంబరు 29న జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు

- September 21, 2023 , by Maagulf
సెప్టెంబరు 29న జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు

కువైట్: సెప్టెంబర్ 29న జహ్రాలో భారత రాయబార కార్యాలయం కాన్సులర్ క్యాంప్‌ను నిర్వహించనుంది. కాన్సులర్ క్యాంప్ వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్-02, స్ట్రీట్-06, హౌస్ 2-జహ్రా) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతుంది. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, వీసా ఫిర్యాదులు, పిసిసి దరఖాస్తులు, రిలేషన్ షిప్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సంతకం ధృవీకరణ, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు, రిజిస్ట్రేషన్ వంటి వివిధ సేవల కోసం నిర్వహించే ఈక్యాంపును జహ్రా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు వినియోగించుకోవాలని ఎంబసీ తెలిపింది.  శిబిరంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే ఇవ్వబడతాయి. అన్ని కాన్సులర్ సేవలకు నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ పేర్కొంది. అలాగే శిబిరంలో భారతీయ వైద్యుల ఫోరమ్‌లోని వైద్యులు భారతీయ జాతీయులకు ఉచిత వైద్య పరీక్షలను అందించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com