చీకటి సంద్రంలో హైదరాబాద్
- May 20, 2016
హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు వడగళ్లు పడ్డాయి. అనేకచోట్ల హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడటంతో ఐదుగంటలకే నగరంలోని రోడ్లన్నీ చీకటిమయంగా మారాయి. వర్షపు నీటితో నగరంలోని రోడ్లు జలమయంకావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ జీవీకే మాల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బంజారాహిల్స్ వాటర్ ట్యాంక్ వద్ద పైప్ లైన్ పగిలిపోయింది. నీటి ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలతో భారీ వడగళ్ల వర్షం రావడం హైదరాబాద్ వాసులను కలవరానికి గురిచేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







