వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సు ప్రారంభం

- September 23, 2023 , by Maagulf
వేములవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సు ప్రారంభం

తెలంగాణ: వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సును స్థానిక బస్టాండ్ లో శుక్రవారం రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.డిపో మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వేములవాడ నుంచి డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 04:30 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాత్రి 09:00 గంటలకు చేరుకుంటుందన్నారు.మళ్లీ మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వేములవాడకు 10:00 గంటలకు చేరుకుంటుందని వివరించారు.ఒక్కరికి టికెట్ రూ.500 ఉంటుందని తెలిపారు.ఎస్బిఐ వర్జీలాల్,రామచందర్,సత్యనారాయణ,రాం రెడ్డి,శిరీష,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరో వారం పాటు ఈ బస్సు సౌకర్యం చూసి బస్సు బయల్దేరే సమయం మారుస్తామని TSRTC అధికారి పి.జీవన్ ప్రసాద్ మాగల్ఫ్ కు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com