రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు విచారణ ప్రారంభం
- September 23, 2023
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టిడిపి అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది. అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







