జమిలీ ఎన్నికల పై నేడు రామనాధ్ కోవింద్ నేతృత్వంలో తొలి సమావేశం
- September 23, 2023
న్యూఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నికల్లో భాగంగానే భారత మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ నేతృత్వంలో ఈ రోజు తొలి సమావేశం జరుగనుంది. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కమిటీ లో సభ్యులు గా ఉన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, లోకసభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి. కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, మాజీ ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, 15 వ ఆర్ధిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్.కె.సింగ్, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ ఆజాద్ ఉన్నారు.
అయితే, కమిటీ నుంచి లోకసభ లో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధురి తప్పుకున్నారు. లోకసభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలైనమున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే సాంకేతికంగా, సాధ్యాసాధ్యాల పై సమాలోచనలు జరిపి, సిఫార్సులు చేయనుంది “కోవింద్ కమిటీ”. 1967 వరకు ఒకేసారి ఎన్నికలు ఉండేవి…1968, 69 లలో కొన్ని అసెంబ్లీ లు రద్దయ్యాయి. ఇక ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడి సర్కార్ అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









