సచిన్ చేతుల మీదగా జెర్సీ అందుకున్న ప్రధాని మోడీ
- September 23, 2023
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఇక్కడి గంజారి ప్రాంతంలో జరిగిన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవి శాస్త్రి తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా జెర్సీ బహూకరించారు. ‘నమో’ అని రాసి ఉన్న ఆ ప్రత్యేకమైన జెర్సీని సచిన్ చేతుల మీదుగా అందుకున్న మోడీ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









