పాస్‌పోర్టుకు 'తండ్రి' అవసరం లేదు!
- May 20, 2016
తండ్రితో సంబంధం లేకుండా తల్లి వద్ద నివసించే పిల్లలకు పాస్‌పోర్టు జారీ విషయంలో తండ్రి పేరును రాయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ జగన్మోహన్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యలయానికి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి పేరును ఇవ్వాలంటూ తల్లితో కలిసి జీవించే బిడ్డలను ఒత్తిడి చేయకూడదని కోర్టు పేర్కొంది.గత కొంతకాలంగా సింగిల్ పేరెంట్‌షిప్ పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న ధర్మాసనం.. పెళ్లి కాకుండా తల్లులవుతున్న మహిళలు, సెక్స్ వర్కర్స్, పెంపుడు తల్లులు, రేప్ బాధితులు, తండ్రి వదిలేసిన పిల్లలు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించిన బిడ్డలకు పాస్ పోర్టు జారీలో ఉన్న సాఫ్ట్ వేర్ కారణంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంది. సాఫ్ట్ వేర్ లో తల్లిదండ్రుల పేర్లు కచ్చితంగా జతచేయాల్సి రావడం సమస్యగా మారింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సాఫ్ట్ వేర్ న్యాయవ్యవస్థ కాలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని ఓ అమ్మాయికి పాస్ పోర్టును జారీ చేయకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జడ్జి.. పాస్‌పోర్టు జారీకి తండ్రితో పనిలేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా 2005, 2009లలో విచారణకు వచ్చిన ఇలాంటి కేసుల తీర్పును కోర్టు ప్రస్తావించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









