టి.గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
- September 25, 2023
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన దాసోజు, మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించిది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు.
వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. దాసోజు, కుర్రాలు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







