ఉమ్రా ట్రిప్‌తో బస్‌ డ్రైవర్స్‌కి ఆర్‌టీఏ 'బహుమతి'

- May 20, 2016 , by Maagulf
ఉమ్రా ట్రిప్‌తో బస్‌ డ్రైవర్స్‌కి ఆర్‌టీఏ 'బహుమతి'

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీకి చెందిన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ, ఉమ్రా ట్రిప్‌ని 15 మంది పబ్లిక్‌ బస్‌ డ్రైవర్స్‌కి బహుమతిగా ఇచ్చింది. వారిలో ఆనందోత్సాహాల్ని నింపింది. ఆర్‌టిఎలోని ఓ సెగ్మెంట్‌కి ప్రత్యేక గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్‌ అలీ వెల్లడించారు. ఎంపిక చేయబడిన డ్రైవర్లుకి ఏజెన్సీ నుంచి ఎస్కార్ట్‌ ఇచ్చి మరీ ఉమ్రాకి పంపారు. అలాగే, వారికి మంచి హోటల్‌లో అకామడేషన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ వంటివి ఏర్పాటు చేశామని అలి చెప్పారు. ఉమ్రా గతంలో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా నిర్వహించినవారికి, ఐదేళ్ళ నుంచి వారి కెరీర్‌ కండక్ట్‌ని పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టారు. హోలీ సైట్స్‌ నుంచి తిరిగి వచ్చిన డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ మరియు ఎంప్లాయీస్‌, డ్రైవర్ల మధ్య సంబంధాలు ఇంకా బలోపేతమయ్యేందుకు ఇలాంటివి ఉపయోగపడ్తాయని ఆయన చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com