నిమజ్జన సరళిని పరిశీలించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

- September 25, 2023 , by Maagulf
నిమజ్జన సరళిని పరిశీలించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు రాజేంద్రనగర్ జోన్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువు/Baby Pondను  రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఓటి డిసీపీ రషీద్, రాజేంద్రనగర్ ఏడీసీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., తదితరులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ గారు మాట్లాడుతూ... సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పరంగా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. ఈ నెల 18వ తేదీన మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కమీషనరేట్ పరిధిలో 12000 పైగా వినాయకులను ప్రతిష్టించారన్నారు. పత్తి కుంట చెరువు వద్ద 2 భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ పత్తి కుంట చెరువులో 1700 కు  పైచిలుకు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. అవసరం మేరకు చివరి రోజు వరకూ ఇంకొక క్రేన్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేందుకు కమీషనరేట్ పరిధిలో 24 X 7 పని చేస్తూ భద్రతాపరంగా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గణేశ్‌ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతిష్ఠించిన గణేశ్‌ విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించామన్నారు.

గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగేలా, ఎక్కడా  ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నిమజ్జన విషయానికి వస్తే నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

నిమజ్జనం సందర్భంగా GHMC అధికారులు ముందుగానే చెరువులు, baby పాండ్స్ ను సూచించి అక్కడ అవసరమున్న మేర వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, క్రేన్లను ఏర్పాటు చేశారన్నారు. చెరువు కట్టల వద్ద విద్యుత్‌ లైట్లను, బ్యారికేడ్లను నిర్మించి భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు.

ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమత్తు పనులు, శానిటైజేషన్ పనుల చేపట్టామన్నారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

నిమజ్జనం రోజు ఆయా రూట్లలో జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ, ఆర్‌ అండ్‌బీ శాఖల మరియు ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టామన్నారు.

నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ పై  ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించాము. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు.

 సీపీ తో  పాటు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఓటి డిసీపీ రషీద్, రాజేంద్రనగర్ ఏడీసీపీ  రష్మీ పెరుమాళ్ మాదాపూర్ ఎస్ఓటి ఏడీసీపీ నారాయణ, ఏడీసీపీ క్రైన్స్  నరసింహారెడ్డి, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరెడ్డి, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్,  రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ మురళీకృష్ణ, రాజేంద్రనగర్ ఇన్ స్పెక్టర్ నాగేంద్రబాబు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బోస్ కిరణ్, సిసిఎస్ ఇన్ స్పెక్టర్ రాజేంద్రనగర్ నరసింహ, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఇతర శాఖల అధికారులు తదితర పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com