రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్‌ భేటీ

- September 26, 2023 , by Maagulf
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్‌ భేటీ

న్యూఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంటు కేసులో అరెస్టయి, బెయిల్ కోసం పోరాడుతుండగా… ఆయనకు మద్దతు కూడగట్టేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ ముమ్మరంగా శ్రమిస్తున్నారు. స్కిల్ వ్యవహారంలో ఇప్పటికే జాతీయ మీడియా ఎదుట తమ బాణీని వినిపించిన లోకేశ్… పార్లమెంటులోనూ చంద్రబాబు వ్యవహారం ప్రస్తావనకు వచ్చేలా టిడిపి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలను కూడా కలుస్తున్నారు.

తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన అరాచకాలమయం అని, విపక్షాలను అణచివేస్తున్నారని లోకేశ్ రాష్ట్రపతికి వివరించారు. ఈ సమావేశంలో లోకేష్ తో పాటు టిడిపి ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. కాగా, టిడిపి బృందం చెప్పిన విషయాలను రాష్ట్రపతి సానుకూలంగా విన్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com