హైదరాబాద్ లో లులు మాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- September 27, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరో మాల్ అందుబాటులోకి వచ్చింది. కుకట్ పల్లిలోని కేబీహెచ్ బీ కాలనీలోని సరికొత్త మాల్ అందుబాటులోకి వచ్చింది. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన లులు మాల్ ను మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఎన్నో మాల్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేని ప్రత్యేకత దానిదే. అటువంటి నగరంలోకి లులు వచ్చి చేరింది. ఈ మాల్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని సంస్థ ప్రతినిధుతు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేబీహెచ్ బిలో ప్రారంభమైన ఈ మాలత్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైనట్లు అయ్యింది.

దాదాపు ఐదు లక్షల చదరపు విస్త్రీర్ణంలో ఉండే ఈ లులు మాల్.. రెండు లక్షల చదరపు అడుగుల హైపర్ మార్కెట్‌తోపాటు అత్యంత అధునాతన గ్లోబల్ రిటెయిల్ షాపింగ్ అనుభవాన్ని అందినుంది. నగరంలో కూకట్పల్లి ప్రాంతమంటే అదో జనారణ్యమనే చెప్పాలి. ఎప్పుడు అంత్యం రద్దీగా ఉండే కుకట్ పల్లి ఏరియాలో ప్రారంభమైన ఈ మెగా షాపింగ్ మాల్ నగరవాసులను ఆకట్టుకోనుంది. ఈ లులు మాల్ ప్రారంభంతో తెలంగాణలో లులు గ్రూప్‌కి ఇది మొదటి వెంచర్ అని చెప్పాలి. 2022లో మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా జరిగిన ఒప్పందంలో భాగంగా తెలంగాణలో భారీ పెట్టుబడుల హామీలో భాగంగా ఈ మాల్ ఏర్పాటు అయ్యింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







