గూగుల్ 25వ వార్షికోత్సవం..

- September 27, 2023 , by Maagulf
గూగుల్ 25వ వార్షికోత్సవం..

ప్రపంచ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఈ రోజు (సెప్టెంబర్ 27) తన 25వ పుట్టినరోజును ప్రత్యేక డూడుల్‌తో జరుపుకుంటోంది. 1998, సెప్టెంబర్ 4న గూగుల్ ను సెర్గీ బ్రిన్, లారీ పేజ్ అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్టులు స్థాపించారు. అయితే, ఒక దశాబ్దానికి పైగా గూగుల్ తన పుట్టినరోజును సెప్టెంబర్ 27న జరుపుకుంటుంది.

అందులో భాగంగా కంపెనీ ‘వాక్ డౌన్ మెమరీ లేన్’ని తీసుకుంది. గూగుల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్‌ డూడుల్ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. గూగుల్ లోగో ప్లేస్‌లో 25వ వార్షికోత్సవాలు (G25gle) అనే అక్షరాలు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. వాస్తవానికి, గూగుల్ కు సెప్టెంబర్ 4కు 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

25 ఏళ్ల క్రితం, కాలిఫోర్నియా సబర్బ్‌లోని గ్యారేజ్ నుంచి గూగుల్ శోధన ప్రారంభమైంది. మొత్తం 6 ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలు, డేటా కేంద్రాలను గూగుల్ కలిగి ఉంది. గూగుల్ తన 25వ పుట్టినరోజును పురస్కరించుకుని #Google25 గుర్తుగా వివిధ డూడుల్‌లను తన వెబ్ పేజీపై ప్రదర్శించింది. ప్రస్తుతం గూగుల్ హోం పేజీలో (Google Doodle GIF)తో వస్తుంది. ‘Google’ని ‘G25gle’గా మార్చేసింది. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ ఈ రోజును ‘ప్రతిబింబించే సమయం’గా ఉపయోగిస్తున్నట్లు టెక్ సంస్థ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com