ఐదుగురిని రక్షించిన సోదరీమణులను సత్కరించిన పోలీసులు
- September 29, 2023
దుబాయ్: ఇద్దరు ఎమిరాటీ సోదరీమణులు అమ్నా మరియు మైతా ముఫ్తాహ్ ముహమ్మద్, రస్ అల్ ఖైమాలోని ఔటర్ రోడ్లో ఓ కారు ప్రమాదానికి గురైనప్పడు అందులోని ఆసియాకు చెందిన ఐదుగురు కుటుంబసభ్యులను రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులోని కుటుంబసభ్యులను ఈ సోదరీమణులు ధైర్యంగా వారి వాహనం నుండి బయటకు లాగారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్ మరియు రెస్క్యూ బృందాలు వచ్చే వరకు ఇద్దరూ వారికి ప్రథమ చికిత్స అందించారు. వారి ధైర్య సహసాలను గమనించిన రాస్ ఖైమా పోలీసులు, కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ పోలీస్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్-నుయిమి ఆదేశాల మేరకు బుధవారం (సెప్టెంబర్ 25) ఇద్దరు సోదరీమణులను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుండి తిరిగి వస్తుండగా బాధితుల కారు ప్రమాదానికి గురై కనిపించిందని, వెంటేనే తాము ఆలస్యం చేయకుండా వారికి సహాయం అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









