మస్కట్ -తిరువనంతపురం మధ్య ఒమన్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్
- September 29, 2023
మస్కట్: ఒమన్ ఎయిర్ త్వరలో మస్కట్ నుండి దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ రాజధాని తిరువనంతపురంకు నేరుగా విమాన సర్వీసుని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుండి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మస్కట్తో కలుపుతున్నట్లు ఒమన్ అధికారికంగా ప్రకటించింది.రెండు నగరాల మధ్య 162 మంది సామర్థ్యంతో బోయింగ్ 737 విమానాన్ని నడుపనున్నారు. ఆది, బుధ, గురు, శనివారాల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆది, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు వచ్చి 8.45 గంటలకు బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.55 కు వచ్చి సాయంత్రం 4.10గంటలకు బయలుదేరుతుంది. శనివారాల్లో ఈ విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చేరి 3.30 గంటలకు బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









