జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- October 01, 2023
కువైట్: కువైట్‌లోని KGL గ్రూప్‌కు చెందిన మాజీ డిప్యూటీ గ్రూప్ CFO విశ్వనాథ్ పిచుమోనీ జింబాబ్వేలో ఒక ప్రైవేట్ విమానం ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. విశ్వనాథ్ KGL గ్రూప్ CFO గా కువైట్‌లో పనిచేసారు. అతను ప్రస్తుతం భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉంటున్నారు. విశ్వనాథ్ హరారేలో తాత్కాలికంగా ఇటీవల ఉద్యోగంలో చేరారు. అతను, మరో ఐదుగురితో కలిసి డైమండ్ మైనర్ రియో జిమ్‌కు చెందిన సెస్నా 206 విమానంలో హరారే నుండి జ్విషావనేలోని మురోవా డైమండ్స్ మైన్‌కి వెళ్తున్నాడు. రియో జింబాబ్వే కంపెనీకి చెందిన ప్రైవేట్ విమానం. ఉదయం 8 గంటల ప్రాంతంలో కూలిపోయే ముందు సాంకేతిక సమస్య తలెత్తిందని, అందులో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ మరణించారని అనుమానిస్తున్నారు. విశ్వనాథ్ భార్య ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీమతి మాలినీ విశ్వనాథ్. ప్రస్తుతం వారు వేరుగా ఉంటున్నారు. ఆమె కువైట్‌లో రాగ్ ఎన్'రిథమ్ వ్యవస్థాపకురాలు. వీరి కుమార్తె రాఘవి విశ్వనాథ్ నెదర్లాండ్స్‌లో, కుమారుడు రాఘవ చదువుతున్నారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి