7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- October 01, 2023
రియాద్: రెసిడెన్సీ, కార్మిక చట్టాలు మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 11,465 మందిని కింగ్‌డమ్‌లోని వివిధ ప్రాంతాలలో వారం రోజుల్లో అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, సెప్టెంబర్ 21 నుండి 27 వరకు ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయిన వారిలో 7,199 మంది రెసిడెంట్ ,2,882 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను, 1,384 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సరిహద్దులుదాటులూ మరో 711 మంది అరెస్టయ్యారు. మొత్తంగా 52% మంది యెమెన్‌లు, 45% ఇథియోపియన్లు, 3% ఇతర జాతీయులు ఉన్నారు. చట్టవిరుద్ధంగా వారికి సహకించిన 15 మంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 43,772 మంది చట్టాలను ఉల్లంఘించినవారు ప్రస్తుతం సంబంధించిన ప్రక్రియలకు లోబడి ఉన్నారు. వీరిలో 36,404 మంది పురుషులు, 7,368 మంది మహిళలు ఉన్నారు. వారిలో 38,379 మంది ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 1,704 మంది ప్రయాణ రిజర్వేషన్‌లను పూర్తి చేయడానికి, 7,922 మందిని బహిష్కరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే.. జైలు శిక్షతోపాటు SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి