కంగనా రనౌత్ మార్పు మంచిదే కానీ, వర్కవుట్ అవ్వలేదే.!

- October 02, 2023 , by Maagulf
కంగనా రనౌత్ మార్పు మంచిదే కానీ, వర్కవుట్ అవ్వలేదే.!

‘చంద్రముఖి 2’ సినిమాతో కంగనా రనౌత్ ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత సౌత్ ప్రేక్షకుల్ని మళ్లీ పలకరించే అవకాశం దక్కింది కంగనా రనౌత్‌కి.

ఈ సినిమాని సౌత్‌లో ఆమె ప్రమోట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. దాంతో, కంగనా రనౌత్ ప్రయత్నం విఫలమైంది. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌లా పబ్లిసిటీ స్టంట్లు చేసే కంగనా రనౌత్ ఈ సినిమా కోసం ఎందుకో తెలీదు కానీ, చాలా ఒదిగినట్టుగా కనిపించింది. ఆమెలో వచ్చిన ఈ మార్పుకి  అందరూ షాకవ్వడంతో పాటు ప్రశంసలు కూడా కురిపించారు.

అంత చేసినా ‘చంద్రముఖి 2’ ఫెయిలైంది. అయితే, తాజాగా మరో చిత్రం కంగనా నుంచి రాబోతోంది. అది ‘తేజస్’. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కంగనా నటిస్తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో మళ్లీ కంగనా ఈజ్ బ్యాక్ అవుతుంది అని ఆమె అభిమానులు నమ్ముతున్నారు. టీజర్‌ని బట్టి సినిమాలో యాంబియెన్స్.. కంగనా నటన అన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని ఈ సినిమా కంగనాకి మంచి గుర్తింపు తీసుకొస్తుందనీ ఆశిస్తున్నారు. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com